
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్న. పుష్ప, యానిమల్ లాంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అవడంతో పాటు నేషనల్ క్రష్ ట్యాగ్‌తో దూసుకెళుతోంది రష్మిక. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆమె.. ఇటీవల కేరళలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైంది. ఆకు పచ్చని చీరలో ‘పుష్ప’ చిత్రంలోని శ్రీవల్లి పాత్రను గుర్తు చేసిన ఆమె.. అభిమానుల కోరిక మేరకు డ్యాన్స్ కూడా చేసింది.
విజయ్ ‘వారసుడు’ చిత్రంలోని రంజితమే పాటకు ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు తను హీరోయిన్‌గా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం విడుదలై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ మెమొరీస్‌ను గుర్తు చేసుకుంది రష్మిక. సినిమా ఫలితం మాటెలా ఉన్నా..
ఇందులోని ‘లిల్లీ’ పాత్రతో తనను ఇప్పటికీ పిలుస్తుండడం ఎంతో స్పెషల్ అని చెప్పింది. ఇక ప్రస్తుతం ‘పుష్ప 2’తో పాటు ధనుష్ ‘కుబేర’ గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో, చావా, సికందర్ చిత్రాల్లో ఆమె నటిస్తోంది.