
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘థామా’ (Thamma). ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించాడు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. అక్టోబర్ 21న సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్, గ్లింప్స్, పోస్టర్స్ థామాపై భారీ అంచనాలు పెంచాయి. మరీ ముఖ్యంగా ఇప్పటివరకు రిలీజైన ప్రమోషన్స్ వీడియోస్ అన్నీ రష్మిక చూట్టే ఉండటం ఆసక్తి కలిగిస్తున్నాయి. రష్మిక క్రేజీ లుక్స్, టీజర్ అండ్ ట్రైలర్లో రొమాంటిక్ సీన్స్ వైబ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే థామా నుంచి ‘తుమ్ మెరే నా హుయే’ వీడియో సాంగ్ (సెప్టెంబర్ 29న) రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక హాట్ మూవ్స్తో కిరాక్ స్టెప్పులు వేసింది. రష్మిక అందాలు, ఆయుష్మాన్తో చేసే రొమాన్స్ సీన్స్.. ఫ్యాన్స్ను రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఇపుడు ఈ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్లో కొనసాగుతోంది. కోటి 60 లక్షలకి పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది. మరి ఈ క్రేజీ హాట్ సాంగ్ను చూసేయండి!!!
ఇటీవలే హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు థామా మేకర్స్. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ‘ఈ కథకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పెర్ఫార్మెన్స్‌లు అమేజింగ్‌గా ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చిన మాడాక్ ఫిల్మ్స్‌కి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఉంటుంది. ప్రతి సినిమాకి ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ సినిమాతో కూడా ఆడియెన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తానని భావిస్తున్నా’ అని చెప్పింది.
#TumMereNaHuye .. there was a long story behind this shoot and have worked really hard for this one..❤️ I hope you guys like it! ❤️ it’s all yours now!https://t.co/bESAQXQpI4
— Rashmika Mandanna (@iamRashmika) September 29, 2025
ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ ‘మాడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్స్‌లో వస్తున్న నెక్స్ట్ చాప్టర్ ‘థామా’. ఇది ‘బేతాళ్’కి హెడ్. రష్మికతో ఫస్ట్ టైం కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆమె బ్రిలియంట్ పెర్ఫార్మర్. నేను ప్రతి సినిమాకి ఒక కొత్త కాన్సెప్ట్ ఉండేలా చూస్తుంటాను. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఆడియెన్స్‌ని అలరిస్తుంది. ఇందులో నేను చేసిన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది’ అని చెప్పాడు.
హిందీ బాక్సాఫీస్ క్వీన్ రష్మిక:
రష్మిక 2023 చివర్లో యానిమల్, 2024లో పుష్ప 2, ఈ 2025లో ఛావా. ఈ మూడు సినిమాల్లో భిన్నమైన పాత్రలు పోషించి మెప్పించింది. అంతేకాకుండా ఈ మూడు సినిమాలూ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలో గత 16 నెలల్లో ఆమె నటించిన మూడు సినిమాలు కలిపి ఏకంగా రూ.3300 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇదే కాకుండా.. రష్మిక నటించిన యానిమల్ హిందీలో రూ.503 కోట్లు, పుష్ప 2 హిందీలో రూ.812 కోట్లు, ఛావా హిందీలో రూ.532 కోట్లు వసూలు చేశాయి.
ఈ మూడు సినిమాలు మొత్తంగా కలిపి కేవలం హిందీలోనే రూ.1850 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ క్రమంలో రష్మిక నటిస్తున్న థామపై భారీ అంచనాలే నెలకొన్నాయి. థామ ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయనుందో అనే ఆసక్తి నెలకొంది.