
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక మందన్న. ఎప్పటికప్పుడు తను నటిస్తున్న సినిమాల అప్‌డేట్స్‌తో పాటు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. అయితే ఇదే సోషల్ మీడియాలో తనపై జరిగిన ట్రోలింగ్, నెగిటివిటీ కామెంట్స్ గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
‘‘నేనెంతో ఎమోషనల్, నిజాయితీ గల వ్యక్తిని అని నాకు తెలుసు. కానీ దానిని నేను బయట చూపించలేను. ఎందుకంటే ప్రస్తుతం దయాగుణాన్ని నటనగా, బలహీనతగా ముద్ర వేస్తారు. కెమెరాల కోసమే నేనలా చేస్తున్నా అంటారు. అందుకే నాలోని ఎమోషనల్ సైడ్‌ను ఎప్పుడూ బయటపెట్టకుండా చాలా స్ట్రాంగ్‌గా ఉంటా. చాలా నెగిటివ్ పీఆర్, పెయిడ్ ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నా.
అందరికీ సమాన అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలో ఎవరైనా కష్టపడితే ఎదగవచ్చు. కానీ ఒకరిపై నెగిటివ్‌గా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు” అని రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది. నెగిటివిటీ నుంచి కోలుకోవడం ఒక లూప్‌లో చిక్కుకున్నట్టుగా ఉంటుందని, ట్రోలింగ్ చేసేవాళ్లు ఒకరి పట్ల దయగా ఉండడం రాకపోతే మౌనంగా ఉండాలని ఆమె సూచించింది.
ఇక ఆమె హీరోయిన్‌గా నటుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కాబోతోంది. మరోవైపు ఇటీవల ‘మైసా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీని స్టార్ట్ చేశారు. అలాగే హిందీలో ఆయుష్మాన్ ఖురానాకు జంటగా ‘థామా’లో నటిస్తోంది.