
టాలీవుడ్ ట్రెండింగ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య రిలేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ అమ్మాయి చేతిలో చెయ్యేసి ఉన్న ఫొటోను విజయ్ షేర్ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్తానంటూ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా ఆ అమ్మాయి ఎవరో నెటిజన్లు కనిపెట్టేశారు. ఇటీవల రష్మిక తన మేనేజర్ పెళ్లి వేడుకలో ఎల్లో శారీలో మెరిసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసి విజయ్ ప్రేమలో పడింది రష్మికతోనే అని అంటున్నారు. ఇద్దరూ కలిసే ఉంటున్నారని ఫిక్స్ చేసేస్తున్నారు. ఈ పిక్స్‌లో రష్మిక ఉన్న ఇంటి ఫొటోలు విజయ్ ఫొటోల్లోని ఇళ్లు ఒకేలా ఉండటంతో ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు. దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లి కబురు వినిపించనుందని కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య రూమర్లు, పుకార్లు ఇప్పుడు కొత్తగా వచ్చేవి కాదు. గీత గోవిందం మూవీ నుంచే మొదలయ్యాయి. ఈ సినిమాలో ఇద్దరూ జంటగా నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. అంతేనా.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. విజయ్ దేవరకొండ సినిమాల్లోనే అద్భుతమైన మూవీకి నిలిచింది అది. అప్పటి నుంచే వీళ్లిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఎప్పటికప్పుడు వాళ్లిద్దరూ ఖండిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల వీళ్లిద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లారని.. అందుకు సాక్ష్యం ఈ ఫొటోలే అంటూ.. వాళ్లిద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను షేర్ చేస్తున్నారు నెటిజన్లు..
ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరూ లిమింగ్ రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది. త్వరలో ఊహించని వార్త చెబుతానంటూ ఓ చెయ్యి పట్టుకుని ఫొటోను విజయ్ షేర్ చేయటంతో.. అది రష్మికదే అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. నిజంగా వాళ్లు లివింగ్ రిలేషన్ లో ఉన్నారో లేదో తెలియదు.. నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.