Rashmika Mandanna : ది గర్ల్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

Rashmika Mandanna : ది గర్ల్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

రష్మిక మందన్న, దీక్షిత్‌‌‌‌ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌’.  నటుడు రాహుల్ రవీంద్రన్‌‌‌‌ దీనికి దర్శకుడు.  అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రష్మిక, దీక్షిత్ శెట్టి జంటపై ఇటీవల ఓ పాటను చిత్రీకరించారు. ‘నదివే’ అంటూ సాగే ఈ పాటను ఈ నెల 16న విడుదల చేయబోతున్నట్టు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను  రిలీజ్ చేశారు.

ఇందులో రష్మిక, దీక్షిత్ ఒకరినొకరు చేయి పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ మెలోడీ సాంగ్‌‌‌‌ను హేషమ్ అబ్దుల్ వహబ్ కంపోజ్ చేశాడు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ మూవీ  రిలీజ్ డేట్‌‌‌‌ను  త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఓ వైపు హీరోయిన్‌‌‌‌గా వరుస సినిమాలు చేస్తూనే, ఫిమేల్ లీడ్‌‌‌‌గానూ సత్తా చాటుతోంది రష్మిక.  ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న మరో చిత్రం ‘మైసా’ షూటింగ్ దశలో ఉంది.