రాజస్తాన్ అల్లర్లకు కారణం వీళ్లే.. పెళ్లి కార్డు ఇస్తానంటూ వచ్చి...

రాజస్తాన్ అల్లర్లకు కారణం వీళ్లే.. పెళ్లి కార్డు ఇస్తానంటూ వచ్చి...

రాజస్థాన్లోని జైపూర్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధినేత సుఖ్దేవ్సింగ్ గోగమేడి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుఖ్దేవ్సింగ్ హత్యతో రాజస్థాన్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.

రాజస్థాన్లోని జైపూర్లో రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణిసేన అధినేత సుఖ్దేవ్సింగ్ గోగమేడి హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఇద్దరు దుండగులు మంగళవారం (డిసెంబర్ 5) సుఖ్ దేవ్ సింగ్ ను  అతని ఇంట్లోనే కాల్చి చంపారు. 

సుఖ్ దేవ్ సింగ్ హత్యతో రాజస్థాన్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. మంగళవారం (డిసెంబర్5) న జైపూర్లోని రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణిసేన, సుఖ్ దేవ్ సింగ్ గోగమేడిని గుర్తు తెలియని దుండగులు షూట్ చేసి హత్య చేవారు. ఈ హత్య  రాజు పుత్ కమ్యూనిటీలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.  బుధవారం ( డిసెంబర్6)  రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ను ప్రకటించింది. 

సుఖ్ దేవ్ సింగ్ హత్యకు నిరసనగా బుధవారం ఉదయ్ పూర్ జిల్లా కలెక్టరేట్ ముందు వేలాది మంది ఆయన మద్దతుదారులు ఆందోళన చేశారు. మరోవైపు జైపూర్ లోనూ భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. 

సుఖ్ దేవ్ సింగ్ ను కాల్చి చంపిన షూటర్లను పోలీసులు గుర్తించారు. ఇద్దరు దుండగులు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీగా గుర్తించామని నితిన్ హర్యానాలోని మహేంద్ర గడ్ నివాసి అని రాజస్తాన్ పోలీసులు తెలిపారు. 

మూడో నిందితుడు నవీన్ షెకావత్.. సుఖ్దేవ్సింగ్ గోగమేడి నివాసంలో జరిగిన కాల్పుల్లో మరణించాడని తెలిపారు. ఈ ఘటనలో సుఖ్ దేవ్ సింగ్ సెక్యూరిటీ గార్డులలో ఒకరు గాయపడ్డారు. 
నవీన్ షెకావత్, రోహిత్ రాథోడ్ , నితిన్ ఫౌజీలు పెళ్లి కార్డు ఇచ్చే నెపంతో కర్ణిసేన అధినేత సుఖ్ దేవ్ సింగ్ నివాసంలో ప్రవేశించారని తెలుస్తోంది. 

నిందితుల్లో ఒకరైన నితిన్ ఫౌజీ ఐదేళ్ల క్రితం 2019 ఇండియన్ ఆర్మీలో చేరాడు. మహేంద్ర గఢ్ లోని దౌంగడ జాట్ గ్రామానికి చెందిన నితిన్ ఫౌజీ అల్వార్ లోని 19 జాట్ రెజిమెంట్ లో విధులు నిర్వహిస్తున్నాడు. 

నితన్ తండ్రి మాట్లాడుతూ తన కొడుకు నవంబర్ 9 న మహేంద్ర గఢ్ కు వెళ్లారని.. అప్పటి నుంచి అతనితో కాంటాక్ట్ లేదని చెప్పారు. నితిన్ స్నేహితుడు మీడియాతో మాట్లాడుతూ ‘‘ నితిన్ చాలా మంచివాడు.. ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఎవరో అతడి బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు అని చెప్పారు. 

రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధినేత సుఖ్ దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు రాజస్థాన్ పోలీసులు.. సుఖ్ దేవ్ సింగ్ హత్యతో బుధవారం నిరసనలు ఆందోళనలతో రాష్ట్ర అట్టుడుకి పోయింది. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని  రాజ్ పుత్ కమ్యూనిటీ వర్గాలు, రాజకీయ నేతలు డిమాండ్ చేశారు.