మూడున్నర నెలల తర్వాత ఓపెన్ అయిన రసూల్ పురా రోడ్డు

మూడున్నర నెలల తర్వాత ఓపెన్ అయిన రసూల్ పురా రోడ్డు

మూడున్నర నెలల తర్వాత సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట మార్గంలోని రసూల్ పురా రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ రహదారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.  ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, కంటోన్మెంట్ శాసనసభ్యులు సాయన్న, కమిషనర్ లోకేష్ కుమార్,  డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాజాగా రసూల్ పురా రోడ్డు అందుబాటులోకి రావడంతో వాహనదారులకు ఉపశమనం లభించినట్టయింది. జూలై 19 నుంచి రోడ్డును క్లోజ్ చేసి జీహెచ్ఎంసీ నాలా పనులు చేపట్టింది. అందులో భాగంగా రూ.5 కోట్లతో బల్దియా అధికారులు ఇరువైపులా నాలా పనులను పూర్తి చేశారు. మరో వారం రోజుల్లో జీహెచ్ఎంసీ మినిస్టర్ రోడ్ ను మూసేసి నాలా పనులు చేపట్టనుంది. 

రూ.10 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది. మొత్తం రూ.45 కోట్లతో బేగంపేట వద్ద చేపట్టిన నాలా అభివృద్ది పనులు పూర్తయ్యాయి. అయితే బ్రిడ్జ్ ప్రారంభం వల్ల ఇన్ని రోజులు ఇబ్బందులుపడిన వాహనదారులకు ఊరట లభించింది. మరోవైపు ట్రాఫిక్ సమస్య కూడా కొంతవరకు తగ్గనుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలా బ్రిడ్జి నిర్మాణ పనులు రెండు నెలల్లోనే పూర్తి చేస్తామని అధికారులు అప్పట్లో హామీ ఇచ్చినప్పటికీ.. అందుకు ఆరు నెలల సుదీర్ఘ సమయం పట్టడం గమనార్హం.