Video Viral: మొన్న ఐస్​ క్రీంలో వేలు.. నేడు సాంబారులో ఎలుక.. ఎక్కడంటే.

Video Viral: మొన్న ఐస్​ క్రీంలో వేలు.. నేడు సాంబారులో ఎలుక.. ఎక్కడంటే.

ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టాలంటే కాదు రెస్టారెంట్ కు వెళ్లి నచ్చిన ఆహారాన్ని తినాలన్నా ఆలోచించే విధంగా కొన్ని కొన్ని సంఘటలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఐస్ క్రీమ్ లో వేలు, చాక్లెట్ సిరప్ లో చచ్చిన ఎలుక సంఘటలు మరవక ముందే.. మళ్ళీ సాంబార్ లో ఎలుక ఉన్న ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇప్పుడు మరో గగుర్పొడిచే వార్త బయటకి వచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన కస్టమర్‌కి షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నగరంలోని ప్రముఖ హోటల్‌ దేవి దోసా ఫుడ్‌ జాయింట్‌‌కు వెళ్లాడు. అక్కడ ఫుడ్‌ తీసుకోగా.. అతనికి సర్వ్‌ చేసిన సాంబార్‌ గిన్నెలో చచ్చిపోయిన ఎలుక కనిపించింది.  దీంతో కస్టమర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెస్టారెంట్‌ను సీజ్ చేసి మేనేజ్మెంట్‌కు నోటీసులిచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఇంటర్నెట్‌లో ఓ రేంజ్ లో దుమారం చెలరేగింది. ఈ సంఘటన ఖచ్చితంగా దిగ్భ్రాంతికరమైనది. అంతేకాదు ప్రస్తుతం వరసగా జరుగుతున్న సంఘటనలతో ఆహార భద్రత ఏ విధంగా ఉన్నదనే ప్రశ్న తలెత్తేలా చేస్తుంది. 

జూన్ 20న తన భార్యతో కలిసి డిన్నర్ కోసం దేవి దోస ప్యాలెస్‌కి వెళ్లినట్లు అవినాష్ చెప్పాడు. ఆర్డర్ చేసిన ఫుడ్ ను వడ్డించే ముందు సాంబార్ , చట్నీ వడ్డించారని అతను చెప్పాడు. అయితే సాంబారు తింటూ ఉండగా గిన్నెలో చనిపోయిన ఎలుకను చూసి షాక్ అయ్యానని వెల్లడించాడు. దీంతో కోపోద్రిక్తుడైన అవినాష్ వెంటనే తన మొబైల్ లో సాంబార్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.