లంచం డబ్బులు ఎలుకలు తిన్నయ్..బిహార్ పోలీసుల వింత వాదన..మాజీ ప్రభుత్వ ఉద్యోగికి సుప్రీంకోర్టు బెయిల్

లంచం డబ్బులు ఎలుకలు తిన్నయ్..బిహార్ పోలీసుల వింత వాదన..మాజీ ప్రభుత్వ ఉద్యోగికి  సుప్రీంకోర్టు బెయిల్
  • ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు 
  • ఆధారాలు లేకపోవడంతో మాజీ ప్రభుత్వ ఉద్యోగికి బెయిల్

న్యూఢిల్లీ: లంచం డబ్బులను ఎలుకలు తీనేసాయని పోలీసులు చెప్పడంతో బిహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రభుత్వ అధికారికి బెయిల్ మంజూరైంది. అరుణ కుమారి వర్సెస్ ది ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ కేసులో ఇటీవల జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. 

చైల్డ్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రొగ్రామ్ ఆఫీసర్ (సీడీపీవో)గా విధులు నిర్వహిస్తున్న అరుణ కుమారిపై బిహార్ ఆర్తిక నేరాల విభాగం(ఈవోయూ) 2019 లో చేపట్టిన ఒక ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెడ్ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుకుంది. ఈ కేసులో ఆమె రూ.10 వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న నోట్లను ఒక ఎన్వలప్ లో పెట్టి, సాక్ష్యంగా స్థానిక మాల్ఖానా( ఎవిడెన్స్ రూం)లో భద్రపరిచారు. 

అయితే ఈ కేసులో తొలుత ఆమె నిర్దోషిగా విడుదలయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది. 2025 ఫిబ్రవరిలో పాట్నా హైకోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఎవిడెన్స్ రూంలో డబ్బులు భద్రపరిచినట్లు రికార్డుల్లో నమోదైందని.. అయితే, ఎలుకలు కరెన్సీతో పాటు కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా నాశనం చేశాయని హైకోర్టు అభిప్రాయపడింది. హత్య కేసుల్లో మృతదేహం లేకుండానే శిక్షను నిలబెట్టగలిగినట్లే, ఈ కేసులోనూ భౌతిక నగదు లేకుండానే అవినీతి కేసు నిలబడగలదని పేర్కొంది. ఈ ఉత్తర్వులను ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 

ఎలుకలు ధ్వంసం చేసుడేంది?

ఎవిడెన్స్ రూంలో దాచిన డబ్బును ఎలుకలు తిన్నాయన్న బిహార్ పోలీసుల వాదనలతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘ఇలాంటి కేసుల్లో స్వాధీనం చేసుకున్న కరెన్సీ సురక్షితగా ఉంచకపోవడం ఆశ్చర్యంగా ఉంది. దీనివల్ల బిహార్ రాష్ట్ర ఆదాయ నష్టం’ అని వ్యాఖ్యానించింది. పోలీసుల వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో హైకోర్టు విధించిన నాలుగేండ్ల శిక్షను నిలిపివేసి..  బెయిల్ మంజూరు చేసింది. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తగిన సమయంలో విచారణ చేపడతామని వెల్లడించింది.