రేవ్​ పార్టీ భగ్నం.. ఐదుగురు అరెస్ట్

రేవ్​ పార్టీ భగ్నం.. ఐదుగురు అరెస్ట్
  • 3 గ్రాముల డ్రగ్స్, 12  ఫారిన్​ లిక్కర్​ బాటిళ్లు సీజ్ 

చందానగర్, వెలుగు: హైటెక్​సిటీలోని ఓ అపార్ట్​మెంట్​లో  రేవ్​పార్టీని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ స్పెషల్ టాస్క్​ఫోర్స్​ ఆఫీసర్లు భగ్నం చేశారు. ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని,  ఒక గ్రాము కొకైన్, 2 గ్రాములు ఎండీఎంఏ,12 బాటిళ్ల విదేశీ మద్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. స్టేట్​ఎన్​ఫోర్స్​మెంట్ జాయింట్​ కమిషనర్ కేవై ఖురేషీ, ఎస్టీఎఫ్ ఎస్పీ ప్రదీప్​రావు తెలిపిన ప్రకారం.. బేగంపేటకు చెందిన ఎ.నాగరాజు యాదవ్(31) బిల్డర్. ఈనెల 7న ఫ్రెండ్స్​తో గోవాకు వెళ్లి 3 గ్రాముల కొకైన్ కొన్నాడు. 

తన బర్త్​డే పార్టీ కోసమని మోకిలకు చెందిన ఫ్రెండ్ నితిన్(24) వద్ద దాచాడు. ఇటీవల దుబాయ్ ​నుంచి వచ్చిన తన తమ్ముడు సాయికుమార్ యాదవ్​(27) ద్వారా 12 లిక్కర్  ​బాటిళ్లు తెప్పించాడు. బర్త్​డే పార్టీకి  బంజారాహిల్స్​కు చెందిన కిశోర్ ​ద్వారా హైటెక్​సిటీలోని క్లౌడ్–9 సర్వీస్ అపార్ట్​మెంట్​లో ఫ్లాట్ బుక్ చేశాడు. బుధవారం అర్ధరాత్రి రేవ్​ పార్టీ మొదలుపెట్టాడు. సమాచారం అందడంతో ఎక్సైజ్​ స్పెషల్ టాస్క్​ఫోర్స్ ​ రైడ్ ​చేసి 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

  1.0 గ్రాము కొకైన్​,0.84 గ్రాముల ఓజీకుష్, 2 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. కొంత కొకైన్​, ఎండీఎంఏను అప్పటికే ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. నాగరాజు, సాయికుమార్, ఇమాన్యూయల్, కిశోర్, నితిన్ ను అరెస్ట్​ చేశారు. 12  ఫారిన్​ లిక్కర్​ బాటిళ్లు, ఇన్నోవాను స్వాధీనం చేసుకున్నారు.