రేవ్ పార్టీ షూటింగ్ పూర్తి

రేవ్ పార్టీ షూటింగ్ పూర్తి

క్రిష్ సిద్ధిపల్లి, రితిక చక్రవర్తి జంటగా రాజు బొనగాని దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రేవ్ పార్టీ’. ఐశ్వర్య గౌడ, సుచంద్ర ప్రసాద్, తారక్ పొన్నప్ప ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ముప్ఫై ఐదు రోజుల సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేశారు. ఈ సందర్శంగా దర్శకుడు మాట్లాడుతూ ‘రేవ్ పార్టీలు ఎలా జరుగుతాయి. వాటి వెనుక ఎవరెవరు ఉంటారు. వాటి వల్ల యువతకు జరిగే నష్టం ఏమిటనేది క్లియర్‌‌గా చూపించాం. సాధారణంగా ఉడిపి, గోవా, బెంగళూరు లాంటి ప్రాంతాలలో ఎక్కువగా రేవ్ పార్టీలు జరుగుతుంటాయి. అందుకే ఆయా రియల్ లొకేషన్స్‌ లో షూటింగ్ చేశాం.  ఆగస్టులో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు. ‘యూత్‌ను ఆలోచింపజేసేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు హీరో క్రిష్. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషలలో విడుదల కానుంది.