
జనసేన పార్టీకి.. ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామా లేఖను అంగీకరించాలని ఆ పార్టీ చీఫ్ ను కోరారు రావెల.
గతంలో టీడీపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన రావెల.. ఎన్నికల ముందు జనసేనలో చేరారు. ఎన్నికల్లో జనసేన తరపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.