రావణాసుర సెకెండ్ షెడ్యూల్‌‌ కంప్లీట్

రావణాసుర సెకెండ్ షెడ్యూల్‌‌  కంప్లీట్

బ్యాక్‌‌ టు బ్యాక్ మూవీస్‌‌తో ఫుల్ స్వింగ్‌‌లో ఉన్న రవితేజ.. ఈమధ్యనే ‘ఖిలాడి’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మిగతా చిత్రాల్ని వీలైనంత వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సుధీర్ వర్మ రూపొందిస్తున్న ‘రావణాసుర’ సినిమా సెకెండ్ షెడ్యూల్‌‌ని నిన్న కంప్లీట్ చేశాడు. హైదరాబాద్‌‌లో జరిగిన ఈ షెడ్యూల్‌‌లో  రవితేజతో పాటు మిగిలిన యాక్టర్స్ అంతా పాల్గొన్నారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్‌‌‌‌ పాత్రలో నటిస్తున్నాడు. తన క్యారెక్టర్​కి కాస్త నెగిటివ్ షేడ్స్​ ఉంటాయని తెలుస్తోంది. మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఉంటారు. ఆ పాత్రల్లో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కనిపించనున్నారు. సుశాంత్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. రావు రమేష్,  మురళీశర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్‌‌ప్లే, మాటలు రాస్తున్నాడు. హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అతి త్వరలో మరో షెడ్యూల్‌‌ని స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు కూడా రవితేజ చేతిలో ఉన్నాయి.