బ్యాట్స్‌మెన్‌లకు ‘ఫ్రీ హిట్’ లాగే బౌలర్లకు ‘ఫ్రీ బాల్’ ఇవ్వాలి

బ్యాట్స్‌మెన్‌లకు ‘ఫ్రీ హిట్’ లాగే బౌలర్లకు ‘ఫ్రీ బాల్’ ఇవ్వాలి

భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్

బ్యాట్స్‌మెన్‌లకు ‘ఫ్రీ హిట్’ ఉన్నట్లే బౌలర్లకు ‘ఫ్రీ బాల్’ ఉండాలని భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఒక బౌలర్ నో-బాల్ బౌలింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ వైపు ఫ్రీ హిట్ ఇవ్వబడుతుంది. నో-బాల్ తరువాతి డెలివరీని ‘ఫ్రీ హిట్’ అని పిలుస్తారు. అంతేకాకుండా.. బ్యాట్స్‌మెన్‌ ఆ బంతికి అవుట్ అయినా నాట్ అవుట్ గానే పరిగణిస్తారు.

‘బంతిని బౌలింగ్ చేసే ముందు నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోని బ్యాట్స్‌మన్ క్రీజును వదిలివేస్తే బౌలర్లకు ‘ఫ్రీ బాల్’ ఇవ్వాలి. అలాగే, ‘ఫ్రీ బాల్’ నుంచి బ్యాట్స్‌మెన్‌ అవుట్ అయితే బ్యాటింగ్ సైడ్ ఐదు పరుగులు తగ్గించాలి. ఫ్రీ హిట్ బ్యాట్స్‌మెన్‌లకే కాకుండా.. బౌలర్లకు కూడా ఫ్రీ బాల్ అవకాశాన్ని ఇద్దాం’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు.

గత సంవత్సరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీంలో ఉన్న అశ్విన్.. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోని బ్యాట్స్‌మెన్‌ క్రీజ్ నుండి బయటకు వెళ్ళినప్పుడు మంకాడ్ ద్వారా అవుట్ చేశాడు. రాబోయే ఐపీఎల్ మ్యాచ్ లలో మంకాడ్‌ను వాడకుండా అశ్విన్ తో మాట్లాడతానని ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చెప్పినప్పటి నుండి మంకాడ్ అంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. మంకాడ్ ప్లేస్ లో ఇలా ఫ్రీ బాల్ ఆప్షన్ ఇవ్వాలని అశ్విన్ అన్నాడు.

ఐపిఎల్ యొక్క 13వ ఎడిషన్ సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు జరుగుతుంది. యుఎఇలోని దుబాయ్, అబుదాబి మరియు షార్జాలలో ఈ మ్యాచులు జరుగుతాయి.

For More News..

వీడియో: ప్రాజెక్ట్ గేట్లు ఎత్తితే.. కుప్పలుతెప్పలుగా కొట్టుకొచ్చిన చేపలు

నీట్, జేఈఈ వాయిదా వేయాలి: మమతా బెనర్జీ

బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఇంకా క్రిటికల్ గానే ఉంది

20 వేలమందికి ఉపాధితో పాటు వసతి కల్పించిన సోనూసూద్