కైరో: ఇండియా వెటరన్ షూటర్ రవీందర్ సింగ్.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ (పిస్టల్/రైఫిల్)లో గోల్డ్, సిల్వర్ మెడల్స్‌తో మెరిశాడు. శనివారం జరిగిన మెన్స్ 50 మీటర్ల పిస్టల్ ఫైనల్లో రవీందర్ 569 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచి స్వర్ణం నెగ్గాడు. టీమ్ విభాగంలో రవీందర్ సింగ్ (569)–కమల్జిత్ (540)–యోగేశ్ కుమార్ (537)తో కూడిన ఇండియా త్రయం 1646 పాయింట్లతో సిల్వర్‌ను సొంతం చేసుకుంది.
సౌత్ కొరియా (1648), ఉక్రెయిన్ (1644) వరుసగా గోల్డ్, బ్రాంజ్ మెడల్స్‌ను గెలిచాయి. విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో రెండుసార్లు ఒలింపియన్ ఎలావెనిల్ వలరివన్ బ్రాంజ్ మెడల్‌ను సాధించింది. ఫైనల్లో ఎలావెనిల్ 232 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచింది. బాన్ హైయోజిన్ (సౌత్ కొరియా, 255), వాంగ్ జిఫీ (చైనా, 254) వరుసగా గోల్డ్, సిల్వర్‌ను కైవసం చేసుకున్నారు. టీమ్ విభాగంలో ఎలావెనిల్–మేఘనా సజ్జనార్–శ్రేయ అగర్వాల్‌తో కూడిన ఇండియా బృందం 1893.3 పాయింట్లతో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది.
