కిడ్నపర్ రవి శేఖర్ నేర చరిత్ర

కిడ్నపర్ రవి శేఖర్ నేర చరిత్ర

హైదరాబాద్ : హయత్ నగర్ కిడ్నాప్ కేసులో నిందితుడు రవిశేఖర్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు రాచకొండ సీపీ మహేష్ భగవత్. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ.. రవిశేఖర్ నేర చరిత్రను మీడియాకు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి జూలై-23న  సోనిని కిడ్నాప్ చేశాడని..అయితే అదృష్టవశాత్తు సోని కిడ్నాపర్ నుంచి తప్పించుకుందన్నారు. 2001 నుంచి నిందితుడుకి నేర చరిత్ర ఉందని తెలిపిన సీపీ.. తెలంగాణ, ఏపీలో చాలా కేసులు ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాలతో కలిపి మొత్తం 65 కేసులు ఉన్నాయని చెప్పారు.

మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే రవిశేఖర్.. విజిలెన్స్ అధికారినంటూ అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడన్నారు. నిందితుడు రవిశేఖర్.. సందర్భాన్ని బట్టి రకరకాల పేర్లు మార్చుకుంటున్నాడని.. మే- 23న కాకినాడ కోర్ట్ నుంచి విశాఖపట్నం జైలుకు తరలిస్తుండగా ఎస్కార్ట్ నుంచి తపించుకున్నాడని తెలిపారు. ఫైనల్ గా రవిశేఖర్ ని అరెస్ట్ చేయడంలో ఏపీ పోలీసులు చాలా మంచిగా సహకరించారన్న సీపీ.. నిందితుడి నుంచి గోల్డ్ అర్నమెంట్స్, సెల్ ఫోన్లు, సిమ్ కార్డ్స్, కారు, 47 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.