రవితేజ ‘డిస్కో రాజా’ ఫస్ట్ లుక్.. ఇవి గమనించారా..?

V6 Velugu Posted on Sep 02, 2019

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా డిస్కో రాజా. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వినాయక చవితి సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. గతం.. వర్తమానం.. ఫ్యూచర్.. ఇలా.. సినిమా సాగుతుందని ఫస్ట్ లుక్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.

డిస్కో రాజా ఫస్ట్ లుక్ లో… 1980ల నాటి ఆర్ట్ వర్క్ కనిపిస్తుంది. ఓ చేతిలో బీడీ… మరో చేతిలో గన్.. పాత కాలం నాటి ఫోన్.. డ్రెస్సింగ్.. కలరింగ్.. ఇలా.. అంతా.. 30ఏళ్ల కిందటి వాతావరణంలోకి తీసుకెళ్తాయి. దీన్ని జస్టిఫై చేస్తూ.. ఒకప్పుడు రవితేజ డిస్కోరాజాలా ఉండేవాడన్న సంగతిని ఫస్ట్ లుక్ పోస్టర్ తో చెప్పారు. ఈ సైన్స్ ఫిక్షన్, రివేంజ్ డ్రామా సినిమాలో సంగీతం చాలా ఇంపార్టెంట్ రోల్ పోషించబోతోందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పారు. రివైండ్, ఫాస్ట్ ఫార్వర్డ్ మాత్రమే ఉంటాయని… ప్లే మాత్రం చేయొద్దని.. స్టాప్ చేస్తే చచ్చిపోవడమే అన్నట్టుగా ఓ మ్యూజికల్ ఈక్వేషన్ కూడా ఫస్ట్ లుక్ లో ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది.

డిసెంబర్ లో డిస్కోరాజా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

రవితేజ హీరోగా… పాయల్ రాజ్ పుత్ , నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్కక్షణం లాంటి సినిమాలతో వీఐ ఆనంద్ ఇప్పటికే డిఫరెంట్ సినిమాస దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. రవితేజను కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలో చూపించబోతున్నాడని చిత్రయూనిట్ చెబుతోంది.

నేలటికెట్ సినిమా తర్వాత.. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తాళ్లూరి రామ్ .. రవితేజతో మరోసారి ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 

Tagged First look, Raviteja, Disco raja, VI Anand, VinayakaChavithi

Latest Videos

Subscribe Now

More News