- పాలకవర్గంపై ఓ వర్గం దాడి
- మండల ఆఫీస్వద్ద నిరసన
- రుద్రూర్ పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు
వర్ని, వెలుగు : రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామసభ రసాభాసగా మారింది. బుధవారం సర్పంచ్ గంగామణి అధ్యక్షతన పంచాయతీ భవనంలో సభ నిర్వహించగా ఓ వర్గం అడ్డుకుంది. కుర్చీలు ,టెంట్లు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ నిలదీశారు. దీంతో చిన్న గొడవ పెద్దదిగా మారి తోపులాట, దాడికి దారితీసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని ఇరువురిని సముదాయించారు. ఓ వార్డు సభ్యుడిపై దాడి చేశారని పాలకవర్గం ఆధ్వర్యంలో రుద్రూర్ మండల ఆఫీస్ఎదుట నిరసన తెలిపారు.
గోవింద్రావు, లస్మయ్య, గంగారాం, నీరడి లక్ష్మయ్యతో పాటు పలువురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పాలకవర్గంతో పాటు ప్రజలు నేలపై ఏర్పాటు చేసిన పట్టాపై కూర్చోవాలని విన్నవించినా వినలేదన్నారు. రుద్రూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ పాలకులు డిమాండ్చేశారు.
