న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఒడిశాలో ఒక హై-సెక్యూరిటీ డేటా సెంటర్‌ను నిర్మించింది. భువనేశ్వర్‌లోని ఖోర్దా జిల్లాలో 18.55 ఎకరాల క్యాంపస్‌లో ఏర్పాటైన ఈ సెంటర్, ఆర్‌బీఐ కరెన్సీ మేనేజ్‌మెంట్, పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ కార్యకలాపాలు, రెగ్యులేటరీ డేటా వర్క్‌కు సపోర్ట్‌గా పనిచేస్తుంది.
సరిహద్దు దేశాలు జరిపే డ్రోన్, మిసైల్ వంటి దాడులకు దూరంగా ఉండటంతో పాటు, తక్కువ భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతం కావడంతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఖోర్దా జిల్లాను ఆర్‌బీఐ ఎంచుకుంది. అంతేకాకుండా ముంబై, చెన్నై వంటి సబ్‌సీ కేబుల్ హబ్‌ల నుంచి దూరంగా ఉండటం వల్ల సైబర్ రిస్క్ కూడా తక్కువగా ఉంటుందని అంచనా. ఆర్‌బీఐకి ఇది రెండో డేటా సెంటర్. మొదటిది నవి ముంబైలో ఉంది. కొత్త సెంటర్ టై 4 సర్టిఫికేషన్ పొందింది.
