ఎబిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాష్కు ఆర్బీఐ పర్మనెంట్ లైసెన్స్

ఎబిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాష్కు ఆర్బీఐ పర్మనెంట్ లైసెన్స్

హైదరాబాద్​, వెలుగు:  ఫిన్​టెక్ ​సంస్థ ఎబిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాష్ వరల్డ్ మనీ మనదేశంలో తొలిసారిగా ఆర్​బీఐ  పర్మనెంట్  లైసెన్స్ పొందిన ఆథరైజ్డ్​ డీలర్–​2 కేటగిరీ సంస్థగా ఘనత సాధించింది. రిజర్వ్ బ్యాంక్ చేసిన కీలక సవరణల ప్రకారం, ఈ సంస్థ ఒక్కో లావాదేవీకి రూ.25 లక్షల వరకు ట్రేడ్ రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కుటుంబ నిర్వహణ రెమిటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను సులభంగా నిర్వహించవచ్చు.

దీని ద్వారా దేశంలోని ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపార సంస్థలకు అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులు  సులభతరం కానున్నాయి.  ఈ సంస్థ దేశవ్యాప్తంగా 70కి పైగా నగరాల్లో 100కు పైగా శాఖలు, 20కి పైగా అంతర్జాతీయ విమానాశ్రయాలలో తన సేవలను విస్తరించింది. ఎగుమతిదారులు, దిగుమతిదారులు ఉన్న ప్రాంతాలకే నేరుగా సేవలను తీసుకెళ్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టీసీ గురుప్రసాద్ తెలిపారు.