వడ్డీరేట్లను తగ్గించిన RBI

వడ్డీరేట్లను తగ్గించిన RBI

వడ్డీరేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ద్రవ్యోల్బణం తగ్గడంతో కీలక వడ్డీరేట్లలో 25శాతం తగ్గించింది ఆర్బీఐ. రెపో రేటు 6.5శాతం నుంచి 6.25శాతానికి తగ్గింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన సమీక్ష నిర్ణయాలను ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రివర్స్  రెపో రేటును 6 శాతానికి, బ్యాంకు రేటును 6.5 శాతానికి తగ్గించారు.

2019-20 ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెళ్లలో ద్రవ్యోల్బణం 3.2 నుంచి 3.4 శాతంగా, ఆ తర్వాత మూడు నెలలు 3.9 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతంగా అంచనా వేసింది ఆర్బీఐ. మానిటరీ పాలసీ కమిటీలో వడ్డీరేట్ల తగ్గింపుపై నలుగురు సభ్యులు సానుకూలంగా స్పందించగా.. ఇద్దరు వ్యతిరేకించారు.