
న్యూఢిల్లీ: ఇటీవల గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ. 100, రూ. 200 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం తెలిపింది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ. 100 , రూ. 200 నోట్లను పోలి ఉంటుందని పేర్కొంది.
గతంలో రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన రూ. 100, రూ. 200 నోట్లలోని అన్ని నోట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. మల్హోత్రా డిసెంబర్ 2024లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.