
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఆరుదైన గౌరవం దక్కింది. 2023 సంవత్సరానికి గాను 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' బిరుదును ప్రముఖ ఇంటర్నేషనల్ రీసెర్చి జర్నల్ సెంట్రల్ బ్యాంకింగ్ ప్రదానం చేసింది. కరోనా సమయం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం కారణంగా నెలకొన్న ద్రవ్యల్బణం ఒత్తిళ్లను అధిగమించేందుకు ఆర్బీఐ గవర్నర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించారని అంతర్జాతీయ ఆర్థిక పరిశోధన జర్నల్ కొనియాడింది. ఆయన నాయకత్వంలోనే కఠిన సంస్కరణలు తీసుకురావడంతో పాటు, వినూత్న పేమెంట్ వ్యవస్థలు భారత్‌లో పరిచయం అయ్యాయని పేర్కొంది.
ఒక భారతీయ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఈ అవార్డును అందుకోవడం ఇది రెండోసారి. గతంలో 2015లో ఈ అవార్డును రఘరామ్ రాజన్ అందుకున్నారు. ఇప్పుడు రెండో ఆర్బీఐ గవర్నర్ గా శక్తికాంత దాస్ నిలిచారు. కాగా 2018 డిసెంబర్ 11న భారత రిజర్వ్ బ్యాంక్ 24వ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో శక్తికాంత దాస్ ని భారత ప్రభుత్వం ఆ పదవిలో నియమించింది.