RCB vs GT: ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్-1 హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గుజరాత్ టైటాన్స్ (GT) పై ఘన విజయం సాధించింది. గీ మ్యాచ్‌లో గుజరాత్‌ను చిత్తు చేసిన బెంగళూరు.. నేరుగా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ గెలుపుతో ఇప్పటి వరకు ఐపీఎల్ ఫైనల్ కి బెంగళూరు జట్టు ఐదు సార్లు వెళ్లింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ మీమ్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.
ఆర్‌సీబీ పరుగుల సునామీ.. పాటిదార్ పీక్స్ బ్యాటింగ్!
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. కెప్టెన్ రజత్ పాటిదార్ (93 నాటౌట్) ఖతర్నాక్ ఇన్నింగ్స్‌తో బోర్డుపై 254 పరుగుల కొండంత స్కోరు పెట్టి అప్పుడే సగం మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. దీనికి తోడు రన్ మెషిన్ విరాట్ కోహ్లి వరుసగా నాలుగు సీజన్లలో 600+ రన్స్ కొట్టి అల్టిమేట్ రికార్డ్ సృష్టించగా.. కృనాల్ పాండ్యా (43) కూడా గట్టిగా సహకారం అందించడంతో ఆర్‌సీబీ బ్యాటింగ్ లొల్లి నెక్స్ట్ లెవెల్‌కు చేరింది.
గుజరాత్ టాప్ ఆర్డర్ కొలాప్స్:
255 పరుగుల భారీ చేజింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆర్‌సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (14), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) ఘోరంగా విఫలమై ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. అనంతరం క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ కాసేపు ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. 51 పరుగుల వద్ద జోష్ హేజిల్‌వుడ్ వేసిన అద్భుతమైన డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నిషాంత్ సింధు (5), జేసన్ హోల్డర్లు కూడా పెవిలియన్ చేరడంతో.. 51 రన్స్ దగ్గరే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. వాషింగ్టన్ సుందర్ (8) కూడా జేకబ్ డఫీ బౌలింగ్‌లో హేజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి డగౌట్‌కు చేరాడు. చివర్లో రషీద్ ఖాన్ ఒక భారీ సిక్స్ కొట్టినా.. ఆ మరుసటి బంతికే డఫీ బౌలింగ్‌లో ప్యాకప్ అయ్యాడు. కగిసో రబాడ (9)ను కృనాల్ పాండ్యా అవుట్ చేశాడు.
తెవాటియా ఒంటరి పోరాటం:
ఒకవైపు వికెట్లు పడుతున్నా.. చివర్లో రాహుల్ తెవాటియా మాత్రం దంచికొడుతూ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఆర్‌సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 68 రన్స్ చేసిన తర్వాత అతన్ని భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయడంతో గుజరాత్ కథ ముగిసింది. దీంతో ఆర్‌సీబీ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి అవుట్ కాలేదు.. వాళ్లకు ఇంకో ఛాన్స్ ఉంది. రేపు (2026, మే27న) జరిగే ఎలిమినేటర్ (SRH vs RR) విజేతతో మే 29న క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడనుంది. కానీ ఆర్‌సీబీ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా డైరెక్టుగా సీదా ఫైనల్ కి చేరుకుంది.
