కోహ్లీ కెప్టెన్‌‌గా ఉండటం అదృష్టం

కోహ్లీ కెప్టెన్‌‌గా ఉండటం అదృష్టం

 

అబుదాబి: రాయల్ చాలెంజర్స్‌‌ బెంగళూరు కెప్టెన్సీ నుంచి విరాట్‌‌ కోహ్లీని తప్పించాలని మాజీ ప్లేయర్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ చేసిన వ్యాఖ్యలపై ఆర్‌‌సీబీ ఫ్రాంచైజీ సపోర్ట్‌‌ స్టాఫ్‌‌ మైక్‌‌ హెస్సన్‌‌, సైమన్‌‌ కటిచ్‌‌ భిన్నంగా స్పందించారు. కోహ్లీని తప్పించాల్సిన పని లేదని, అతను కెప్టెన్​గా ఉండడం తమ అదృష్టమన్నారు. ‘లీడర్‌‌షిప్‌‌ పాయింట్‌‌లో చూస్తే విరాట్‌‌ ఉండటం ఆర్‌‌సీబీ అదృష్టం. కోహ్లీ చాలా ప్రొఫెషనల్‌‌. టీమ్‌‌ అతన్ని చాలా గౌరవిస్తుంది. తన గ్రూప్‌‌ కోసం కోహ్లీ చాలా శ్రమిస్తాడు. యంగ్‌‌ ప్లేయర్లకు చాలా టైమ్‌‌ కేటాయిస్తాడు. ముఖ్యంగా దేవదత్‌‌ పడిక్కల్‌‌ను తీర్చిదిద్దించి విరాటే. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. పోటీలో మేం వెనుకబడొచ్చు. కానీ మా పోరాటంలో మాత్రం తేడా లేదు. టీమ్‌‌ సాధించిన విజయాల క్రెడిట్‌‌ మొత్తం విరాట్‌‌కే దక్కుతుంది’ అని కటిచ్‌‌ పేర్కొన్నాడు. బ్యాటింగ్‌‌, కెప్టెన్సీలో విరాట్‌‌కు తిరుగులేదని హెస్సన్‌‌ వెల్లడించాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌‌లో కోహ్లీ ఆడిన తీరే ఇందుకు నిదర్శనమన్నాడు. టీమ్‌‌ పెర్ఫామెన్స్‌‌పై రివ్యూ చేసిన తర్వాత కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామన్నాడు. ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదన్నాడు. ఏదేమైనా వచ్చే ఏడాది మరింత బలంగా వస్తామని హెస్సన్‌‌ స్పష్టం చేశాడు.