యాదాద్రి భువనగిరి జిల్లా : మునుగోడు అభివృద్ధి కోసం ఎలాంటి నిర్ణయానికైనా రెడీ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన చౌటుప్పల్ - నారాయణపురం రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తీసుకున్నాకే రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని.. కాంగ్రెస్ తనను అనేకసార్లు అవమానపరిచిందని తెలిపారు. మునుగోడులో మూడు టీమ్ లతో సర్వే చేయించుకుంటున్న వారి సర్వేలో.. మునుగోడు ప్రజలు ఏం కోరుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటా అన్నారు.
మునుగోడు ప్రజలు రాజీనామా చేయమన్నా, రాజకీయ సన్యాసం తీసుకోమన్నా దానికి రెడీ అని చెప్పారు. సీఎం అరాచక పాలనపైనే పోరాటమని.. కేసీఆర్ ను గద్దె దింపేవరకు ఊరుకోనని తెలిపారు. మొదట్లో ఉప ఎన్నిక విషయం తీసింది కెసిఆర్ అని.. మునుగొడులో చాలా సమస్యలు తిస్టా వేశాయన్నారు. ఉప ఎన్నిక ద్వారా అవి తీరుతాయని ప్రజలు భావిస్తే రాజీనామా చేస్తా అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవడం కోసమే మునుగోడు నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
