న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)తో చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. విద్యార్థుల సౌకర్యాన్ని బట్టి ఎప్పుడైనా, ఎన్ని అంశాల గురించైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గురువారం పార్లమెంట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చలు తన నివాసంలో లేదా ఆఫీస్‌లో నిర్వహించవచ్చని స్పష్టం చేశారు.
మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చర్చలకు రావొచ్చని సీజేపీకి పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు చర్చల కోసం సీజేపీకి 4 ప్రతిపాదనలు పంపినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా పరిష్కార దిశగా ముందుకెళ్లాలని కోరుకుంటోందని జితేంద్ర సింగ్ వెల్లడించారు.
