గొర్రెల స్కాంలో అసలు దోషులను శిక్షించాలి: నిరంజన్

గొర్రెల స్కాంలో అసలు దోషులను శిక్షించాలి: నిరంజన్

హైదరాబాద్, వెలుగు:  గొర్రెల పంపిణీలో నలుగురు అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకున్నంత మాత్రాన సరిపోదని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. ఈ స్కాంలో మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ పీఏ హస్తం ఉన్నట్లు ప్రచారం సాగిందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

శుక్రవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చేపల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై వస్తున్న అవినీతి ఆరోపణలపైనా విచారణ జరపాలని కోరారు.