
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం డల్గా కనిపిస్తోంది. భూములు, స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. కొనుగోళ్లు, అమ్మకాలు 38 నుంచి 43 శాతం పడిపోయాయి. ఓవర్ సప్లై, హై రేట్లే ఇందుకు కారణం. హైదరాబాద్ సిటీలో ప్రాపర్టీ సేల్స్ 43 శాతానికి పడిపోయాయని డేటా ఎనలిటిక్స్ సంస్థ ప్రాప్ఈక్విటీ వివరించింది.
2025 తొలి త్రైమాసికంలో రూ.2 కోట్ల కంటే ఎక్కువ ధర గల అమ్ముడు పోని ఆస్తుల జాబితా 6% పెరిగి 30,320 యూనిట్లకు చేరుకుంది. రూ.2 కోట్ల కంటే అమ్ముడి పోని ఆస్తులు దేశంలోని ప్రధాన నగరాల కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉన్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ తెలిపింది. డిమాండ్-సప్లై మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల హైదరాబాద్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అమ్మకాలు ఓవరాల్గా పడిపోయాయని రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
కోకాపేట్లో Poulomi Estates అనే ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ 55 ఫ్లోర్ల బిల్డింగ్ నిర్మించింది. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ బిల్డింగ్. SAS Crown అనే పేరుతో ఇదే కోకాపేటలో అతి పెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉంది. 57 ఫ్లోర్ల రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇది. అయితే.. 12 వేల స్క్వేర్ ఫీట్ లేదా 15 వేల స్క్వేర్ ఫీట్ ప్రాపర్టీస్ కొనేందుకు హైదరాబాద్లో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ సీఈవో తెలిపారు. మొదట్లో కొంత ఆసక్తి చూపినప్పటికీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పారు. అయితే... హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో అమ్మకాలు పెరిగాయి. కానీ.. అది అంతంత మాత్రమే. సెంట్రల్ హైదరాబాద్ ఇళ్ల విక్రయాల్లో కేవలం ఒక శాతం మాత్రమే జరిగాయి.
Also Read:-కొండ దిగి వస్తున్న బంగారం ధరలు.. హైదరాబాద్లో గోల్డ్ రేట్లు ఇలా ఉన్నాయి
ఇక.. హైదరాబాద్ అపార్ట్ మెంట్లో అద్దెల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ల సగటు అద్దె చదరపు అడుగుకు 7,150కి చేరుకుంది. గత మూడు నెలల్లో ఇళ్ల అద్దెలు 1 నుంచి 4 శాతం పెరగ్గా, అపార్ట్‌మెంట్ల ధరలు చదరపు అడుగుకు 3 నుంచి 5 శాతం పెరిగాయి. LB నగర్‌లో చదరపు అడుగు అద్దె రూ. 6,800, మియాపూర్‌లో రూ. 6,700, గచ్చిబౌలిలో రూ. 8,900, కొండాపూర్‌లో రూ. 8,600. డబుల్ బెడ్రూం, ట్రిపుల్ బెడ్రూం ఇళ్లకు అద్దె నెలకు రూ.14,000 నుంచి రూ. 42,000 వరకు ఉంటుంది.