సెల్​బేలో రియల్​మీ సీ67

సెల్​బేలో రియల్​మీ సీ67

ఎలక్ట్రానిక్స్​ రిటైలర్​ సెల్​బే హైదరాబాద్​లోని తమ గచ్చిబౌలి షో రూమ్ లో రియల్​మీ సరికొత్త 5జీ ఫోన్​ రియల్​మీ సీ67 ను నటి శుభశ్రీ  చేతుల మీదుగా లాంచ్ చేసింది. ఈ సందర్బంగా శుభశ్రీ మాట్లాడుతూ చాలా కాలంగా సెల్​బేతో తనకు అనుబంధం ఉందని,  సీ67 5జీ హ్యాండ్​సెట్​ను ఇక్కడ లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

ఈ సందర్బంగా సెల్​బే మేనేజింగ్ డైరెక్టర్ సోమా నాగరాజు మాట్లాడుతూ , తమ సంస్థ సెల్​బే ఎల్లప్పుడూ తమ కస్టమర్స్ కు సరికొత్త ప్రొడక్ట్స్ అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో   రియల్​మీ ప్రతినిధులు కూడా 
పాల్గొన్నారు.