హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య... పెట్రోల్ పోసి తగలబెట్టి...!

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య... పెట్రోల్ పోసి తగలబెట్టి...!

హైదరాబాద్ లో దారుణం జరిగింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించారు హంతకులు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ దగ్గర జరిగింది ఈ ఘటన. ఆదివారం ( ఫిబ్రవరి 22 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. హిమాయత్ సాగర్ దగ్గర ఓ యువకుడిని హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు దుండగులు. మృతుడు టోలిచౌకికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమీర్ గా గుర్తించారు పోలీసులు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు రాజేంద్రనగర్ పోలీసులు. నిర్మాణస్యమైన ప్రాంతంలో జరిగిన ఈ ఘటన యువకుడిని హత్య చేశాక తగలబెట్టే ప్రయత్నం చేశారా...? లేక సజీవ దహనం చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

అమీర్ శనివారం ( ఫిబ్రవరి 21) మధ్యాహ్నం సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు  అమీర్ తండ్రి.అమీర్ ద్విచక్ర వాహనం ఆధారంగా ఓఆర్ఆర్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించామని..డీజీపీఏ డ్రైవింగ్ సర్కిల్లో అనుమానాస్పద స్థితిలో అమీర్ మృతదేహం లభ్యమైందని తెలిపారు పోలీసులు. 

అమీర్ మృతదేహంపై పెట్రోల్ పోసిన గాయాలు గుర్తించామని.. ఘటనాస్థలంలో క్లూస్ టీం సేకరించిన ఆధారాల ద్వారా హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు పోలీసులు.