కొల్లాపూర్‌లో టీఆర్ఎస్‌కు షాకిచ్చిన రెబల్స్

కొల్లాపూర్‌లో టీఆర్ఎస్‌కు షాకిచ్చిన రెబల్స్

కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడి రాజకీయం ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారింది. అక్కడ టీఆర్ఎస్ నుంచి సీటు రాకపోవడంతో రెబల్స్‌గా పోటీచేసిన అభ్యర్థులు విజయాలు సొంతం చేసుకుంటున్నారు. వీరంతా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు. మొత్తం 20 స్థానాలకు గాను 16 స్థానాల్లో రెబల్స్ విజయం సాధించారు. కేవలం 4 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించింది. సొంత పార్టీపైనే మాజీ మంత్రి జూపల్లి వర్గం విజయం సాధించింది.

కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లోకి రావటంతో… కొల్లాపూర్ టీఆర్ఎస్‌లో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ పంచాయతీ KTR దగ్గరకు వెళ్లినా తెగలేదు. ఈ విషయంలో జూపల్లి వర్గం ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా సొంత పార్టీలోనే ఉండి సొంత పార్టీనే ఓడించారు.

For Municipal Elections Results See Here