ఔను వాళ్లిద్దరూ కలిసిపోయారు

ఔను వాళ్లిద్దరూ కలిసిపోయారు

రాజన్నసిరిసిల్ల, వెలుగు: మొన్నటిదాకా ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం కొనసాగింది. తాజాగా వారిద్దరు ఒకే వేదికమీద కూర్చొని పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కేడర్​కు సూచిస్తున్నారు. ఇప్పటిదాకా కన్ఫ్యూజన్​లో ఉన్న పార్టీ శ్రేణులకు ఫైనల్​గా క్లారిటీ వచ్చింది. వేములవాడ అసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని చల్మెడ లక్ష్మీనర్సింహా రావుకు కేటాయించడంపై చెన్నమనేని రమేశ్ బాబు అలకబూనారు. ఆయన్ను అధిష్టానం బుజ్జగించి నామినేటెడ్ పదవి కట్టబెట్టినా శాంతించ లేదు. దీంతో ఆయన వర్గం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన చల్మెడకు దూరంగా ఉంటూ వచ్చింది. 

ఇటీవల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ వేములవాడలో ఇద్దరితో మాట్లాడి సయోధ్య కుదిర్చారు. దీంతో వినోద్​కుమార్ ఏర్పాటు చేసిన మీటింగ్ లో చెన్నమనేని, చల్మెడ కలిసి పాల్గొన్నారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని రమేశ్ బాబు పిలుపునివ్వడంతో చల్మెడకు ఊరట లభించినట్ల య్యింది.