
ఎల్బీనగర్, వెలుగు: బాలాపూర్ గణనాథుడి దర్శనానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏటా లడ్డూ వేలం పాట సమయంలో వచ్చే భక్తుల కంటే 10 రేట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈసారి స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర ఆలయ నమూనాలో నిర్మించిన మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నట్లు చెప్పారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు, క్యూలైన్ నిర్వహణ, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.