భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో తలనీలాల సేకరణకు నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 2027 జనవరి 31వ తేదీ వరకు తలనీలాలను సేకరించుకు నేందుకు రూ.1.27కోట్లకు వేలంలో హైదరాబాద్ కు చెందిన పుల్లయ్యరెడ్డి హక్కులు పొందారు.
గతంలోనూ రూ.1కోటి 50వేలకు ప్రొద్దుటూరుకు చెందిన సంస్థ దక్కించుకుంది. అదేవిధంగా మార్చి జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు వివిధ పనులు చేపట్టేందుకు దేవస్థానం టెండర్లను ఆహ్వానించింది. రూ.1,56,32,000 విలువైన 20 రకాల పనులకు టెండర్లను పిలిచింది. ఇందులో ఆలయాలకు రంగులు, విద్యుదీకరణ, చలువ పందిళ్లు, ఆర్చీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లవర్ డెకరేషన్, తాత్కాలిక వసతి, తలంబ్రాల పంపిణీ కేంద్రాల నిర్మాణాలు, భద్రాచలం, పర్ణశాలల్లోని గోదావరి తీరంలో భక్తులకు వసతి ఏర్పాట్లు, మిథిలాస్టేడియంలో భక్తులకు సెక్టార్ల నిర్మాణాల కోసం టెండర్లను ఆహ్వానించింది.
