
తెలంగాణలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. బంగాళాఖాతంలో ఉత్తర, దక్షిణ ద్రోణి కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయి..గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షంపడే ఛాన్స్ ఉందని అంచనావేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, జనగాం, సూర్యాపేట, ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వానలు పడతాయని రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్ సిటీ విషయానికివస్తే మరో రెండు రోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
రేపటినుంచి (శనివారం) మూడు రోజుల పాటు టెంపరేచర్లు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పగటిపూట ఎండలు, సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలకుఎక్కువగా ఛాన్స్ ఉందని అంచనా వేస్తుంది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 40నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
►ALSO READ | Heatwaves:బాబోయ్ఎండలు..రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు
ఈ ఏడాది సమ్మర్ సీజన్ లో వాతావరణం మునుపటి కంటే భిన్నంగా ఉంది. ఎండలు, వానలు ఒకేసారి సంభవిస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ ఉంది. మధ్యాహ్నం భగ్గుమంటున్న ఎండలు, సాయంత్రం నుంచి వానలతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.