సుమతీ శతకం బోర్ కొట్టదు: అమర్‌‌‌‌‌‌‌‌దీప్

సుమతీ శతకం బోర్ కొట్టదు: అమర్‌‌‌‌‌‌‌‌దీప్

అమర్‌‌‌‌‌‌‌‌దీప్ చౌదరి,  శైలి చౌదరి జంటగా  ఎంఎం నాయుడు దర్శకత్వంలో సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించిన చిత్రం ‘సుమతీ శతకం’. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానుంది.  గురువారం ప్రీ  రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌‌‌‌‌‌‌‌దీప్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ప్రతి పాత్ర హీరోనే. ప్రతి పాత్రకు ప్రత్యేకత ఉంటుంది.  ప్రేక్షకులకు కచ్చితంగా  నచ్చుతుంది, ఎక్కడా బోర్ కొట్టదు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. తన పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుందని హీరోయిన్ శైలి చెప్పింది.

 అందరి సపోర్ట్‌‌‌‌తో అవుట్‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చిందని, అందర్నీ  ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని దర్శకుడు ఎంఎం నాయుడు అన్నాడు. నిర్మాత కొమ్మలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ ‘తెలుగు రాష్ట్రాల్లో  విడుదల చేస్తున్న మైత్రి మూవీస్‌‌‌‌కు, అలాగే కన్నడలో కేవీఎన్, తమిళంలో జీకే డిస్ట్రిబ్యూటర్స్‌‌‌‌కు థాంక్స్. ఈ సినిమా టికెట్ ధర అందరికీ అందుబాటులో సింగిల్ థియేటర్‌‌‌‌‌‌‌‌లో రూ.100, మల్టీప్లెక్స్‌‌‌‌లో రూ.150 రూపాయలు మాత్రమే ఉంటుంది’ అని అన్నారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు.