Heatwaves:బాబోయ్ఎండలు..రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు

Heatwaves:బాబోయ్ఎండలు..రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గత కొద్ది రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతల కంటే10డిగ్రీల అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

శుక్రవారం (మే2) ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో బేల మండంలో చాప్రాల గ్రామంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో దాదాపు అదే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. 

Also Read : మామిడి పండ్లు సహజంగా మగ్గాయా

మరోవైపు శుక్రవారం  సాయంత్రి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి , వరంగల్, హనుమకొండ, జనగాం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 

భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, ఖమ్మం  జిల్లాలో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఐఎండీ. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.