తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. 13జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..   13జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం ఇప్పటికే ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అయితే రేపటి నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని..వెదర్ డిపార్ట్ మెంట్ వార్నింగ్ ఇచ్చింది. రెండు రోజుల పాటు వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుదని తెలిపింది. దీనికి సంబంధించి 13జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వడగాల్పులు ఎక్కువగా వీస్తాయని తెలిపింది.

రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో 3డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్ శ్రావణి. సిటీలో ఉదయం పొగమంచు, మబ్బు ఉన్న.. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.  ఇప్పటి వరకు అత్యధికంగా ఆదిలాబాద్లో 43.3 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయిందని అన్నారు . 

ఏప్రిల్ 23 వారంలో మాత్రం రాష్ట్రా వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాట నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని సూచించారు. ఇవాళ, రేపు రాత్రి పూట వాతావరణం వేడిగా ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్లు. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మధ్యాహ్నం వేళ ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకోవద్దని తెలిపారు.