పెరటాసి మాసం అయినా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు

పెరటాసి మాసం అయినా తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు

తిరుమలలో ఇవాళ( అక్టోబర్ 7) భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూలైన్లలో భక్తులు చాలా తక్కువగా ఉన్నారు. దర్శనం కోసం నేరుగా భక్తులను అనుమతిస్తున్నారు. స్వామివారి దర్శనానికి కేవలం 3 గంట సమయం పడుతోంది. శనివారం పైగా.. పెరటాసి మాసం అయినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. 

తిరుమలలో శుక్రవారం(అక్టోబర్6) 72,104 భక్తులు స్వామి వారిని దర్శంచుకున్నారు. 25,044 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్లుగా తేలింది. 

మరోవైపు ఈ నెల 9వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది.  మరోవైపు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు 14వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.