జూరాలకు తగ్గిన వరద

జూరాలకు తగ్గిన వరద
  • మూడు గేట్ల ద్వారా నీటి విడుదల

గద్వాల, వెలుగు: ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో జూరాల ప్రాజెక్ట్‌‌‌‌కు ఇన్‌‌‌‌ఫ్లో తగ్గిపోయింది. దీంతో జూరాల నుంచి కేవలం మూడు గేట్ల ద్వారానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌‌‌‌ డ్యామ్‌‌‌‌ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 33.313 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.937 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో ఆ ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి ఆరు వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. భీమా నదిపై ఉన్న సన్నతి బ్యారేజీ నుంచి 16 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. జూరాల ప్రాజెక్ట్‌‌‌‌లో 5.855 టీఎంసీల నీరు నిల్వ ఉంచి మూడు గేట్ల ద్వారా 62,725 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాలకు ప్రస్తుతంత 65 వేల క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది.