
మలక్ పేట వెలుగు : సినీ హీరోయిన్ రెజీనా కసాండ్రా మలక్‌పేట డివిజన్ విజయనగర్ కాలనీలో మెరిశారు. రేస్ టు విన్ ఫౌండేషన్ దత్తత తీసుకొని రెనోవేట్ చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. చిన్నారుల కోసం అంగన్వాడీ కేంద్రాన్ని పాజిటివ్ లెర్నింగ్ స్పేస్‌గా మార్చడం అభినందనీయమన్నారు.
రేస్ టు విన్ ఫౌండేషన్ సేవలు ఎంతో మందికి స్ఫూర్తి అని చెప్పారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై.గోపిరావు పాల్గొన్నారు.