గైడ్ లైన్స్ విడుదల.. నెగెటివ్ వస్తేనే క్యాంపస్ లోకి

గైడ్ లైన్స్ విడుదల.. నెగెటివ్ వస్తేనే క్యాంపస్ లోకి
  • మెడికల్ కాలేజీల రీ ఓపెనింగ్​కు గైడ్ లైన్స్ విడుదల

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో మెడికల్‌‌ కాలేజీల రీఓపెనింగ్‌‌కు సంబంధించి కాళోజీ హెల్త్‌‌ యూనివర్సిటీ బుధవారం గైడ్‌‌లైన్స్‌‌ రిలీజ్‌‌ చేసింది. కరోనాతో గతేడాది మార్చి 21 నుంచి కాలేజీలన్నీ మూతబడ్డాయి. అప్పటి నుంచి ఆన్‌‌లైన్‌‌ క్లాసులు జరుగుతున్నాయి. అకడమిక్‌‌ షెడ్యూల్‌‌ ప్రకారం అన్ని థియరీ క్లాస్‌‌లు కంప్లీట్‌‌ అయ్యాయి. ప్రస్తుతం ప్రాక్టికల్, క్లినికల్ క్లాసులు నిర్వహించడానికి, ఫైనల్‌‌ ఇయర్‌‌ వారి కోసం కాలేజీలను రీఓపెన్‌‌ చేయాల్సి ఉంది. అయితే గతేడాది డిసెంబర్‌‌ 1  లేదా అంతకుముందు నుంచి కూడా కాలేజీలు తెరుచుకోవచ్చని నేషనల్‌‌ మెడికల్‌‌ కమిషన్ సూచించింది. అప్పటినుంచి కొన్ని కాలేజీలు రీఓపెన్‌‌ కాగా, మరికొన్ని తెరవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాళోజీ వర్సిటీ గైడ్‌‌లైన్స్‌‌ విడుదల చేసింది. కాలేజీలను దశలవారీగా తెరుచుకోవాలని చెప్పింది.

ముఖ్యమైన గైడ్ లైన్స్ ఇవే..

ఆర్టీపీసీఆర్‌‌ టెస్ట్‌‌ నెగెటివ్‌‌ రిపోర్ట్‌‌ ఉంటేనే క్యాంపస్‌‌లోకి అనుమతించాలి. కాలేజీకి తమ అనుమతితోనే పిల్లలను పంపిస్తున్నట్లు పేరెంట్స్‌‌ లెటర్‌‌ ఇవ్వాలి. జలుబు, దగ్గు, శ్వాస సంబంధ లక్షణాలు ఉంటే కాలేజీలోకి అనుమతించొద్దు. స్టూడెంట్ల మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. కచ్చితంగా మాస్క్‌‌ లేదా ఫేస్‌‌ కవర్స్‌‌ ధరించాలి. ఆరోగ్యసేతు యాప్‌‌ ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోవాలి. ఉమ్మివేయడం నిషేధం. ప్రతి కాలేజీలో టాస్క్‌‌ ఫోర్స్‌‌ లేదా ఎమర్జెన్సీ మేనేజ్‌‌మెంట్‌‌ టీం ఏర్పాటు చేసుకోవాలి.  కాలేజీల్లో క్లాసులను రెండు షిఫ్టులుగా లేదా రొటేషన్‌‌ పద్ధతిలో నిర్వహించాలి. అడ్మినిస్ట్రేటివ్‌‌ ఆఫీసులు, రీసెర్చ్‌‌ ల్యాబొరేటరీలు, లైబ్రరీలకు కూడా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుతం థియరీ క్లాసెస్‌‌ ఆన్‌‌లైన్‌‌ ద్వారా నడుస్తున్నాయి. కరోనా వ్యాప్తి తగ్గే వరకు దీన్ని కొనసాగించాలి. అన్ని టీచింగ్‌‌ హాస్పిటల్స్‌‌లో కనీసం30 శాతం బెడ్స్‌‌ అలాట్‌‌ చేయాలి. స్టూడెంట్స్‌‌ను బ్యాచ్‌‌లుగా డివైడ్‌‌ చేయాలి. కాలేజీల్లో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేపట్టాలి.