వీసీల నియామకానికి గ్రీన్సిగ్నల్

వీసీల నియామకానికి  గ్రీన్సిగ్నల్

‘వీసీల్లేని యూనివర్సిటీలు’ శీర్షికతో ‘వెలుగు’లో సోమవారం ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. యూనివర్సిటీల్లో ఖాళీ అయిన, ఈనెలాఖరున ఖాళీ అవుతున్న వైస్‌‌ చాన్స్‌‌లర్​పోస్టుల భర్తీకి గ్రీన్‌‌సిగ్నల్‌‌ ఇచ్చింది. రాజీవ్‌‌ గాంధీ యూనివర్సిటీ (ఆర్‌‌జీయూకేటీ–బాసర) మినహా మిగిలిన 9 యూనివర్సిటీల వీసీల పోస్టులను భర్తీ చేసేందుకు మంగళవారం నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఈనెల 10 నుంచి 23 వరకూ అర్హులైన ప్రొఫెసర్ల నుంచి పూర్తిస్థాయి బయోడేటాతో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలను బుధవారం ఉదయం  www.tsche.ac.in   వెబ్‌‌సైట్‌‌లో పొందుపర్చనున్నట్టు చెప్పారు.