రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పతనం

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పతనం

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ (స్టాక్ మార్కెట్ వ్యాల్యూ, మార్కెట్ క్యాప్) నాలుగు రోజుల్లో  రూ.96,000 కోట్లు తగ్గింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రెండు నెలల్లో ఫస్ట్ టైం రూ.8 లక్షల కోట్ల మార్క్ దిగువకు పడిపోయింది. షేరు ధర 4 రోజుల్లో 11 శాతం క్షీణించింది. మే 9 గురువారం నాటి ఆర్ఐఎల్ షేరు క్లోజింగ్ ధర రూ.1,255.15 ప్రకారం చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.7,95,628.55 కోట్లుగా ఉంది. మే 3న ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ రూ.8,91,885.91 కోట్లుగా ఉంది. అంటే నాలుగు రోజుల్లో రూ.96,257 కోట్ల మార్కెట్ క్యాప్ హరించుకుపోయింది.

గ్లోబల్ రీసెర్చ్ అండ్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ.. ఆర్ఐఎల్ స్టాక్‌పై రేటింగ్‌ను ఓవర్‌ వెయిట్ నుంచి ఈక్వల్ వెయిట్‌కు డౌన్‌గ్రేడ్ చేసింది. అలాగే షేరు టార్గెట్ ధరను సవరించింది. దీంతో ఆర్ఐఎల్ స్టాక్‌పై ప్రతికూల ప్రభావం పడింది.