క్విక్​ డెలివరీలోకి రిలయన్స్​ రిటెయిల్​

క్విక్​ డెలివరీలోకి రిలయన్స్​ రిటెయిల్​

ముంబై: జియోమార్ట్​ ఎక్స్​ప్రెస్​ బ్రాండ్​ పేరుతో రిలయన్స్​ రిటెయిల్​ క్విక్​ డెలివరీ సేవలు మొదలు పెట్టింది. నవీ ముంబైలో  ఈ కొత్త సర్వీసు ట్రయల్స్​ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివరిలోగా జియోమార్ట్​కు ఆపరేషన్స్​ ఉన్న 200 సిటీలలో క్విక్​ డెలివరీ సేవలను అందుబాటులోకి తేవాలనేది కంపెనీ ప్లాన్​. బిగ్​బాస్కెట్​, బ్లింకిట్​, స్విగ్గీ ఇన్​స్టామార్ట్​, ఫ్లిప్​కార్ట్​ క్విక్​, జెప్టో వంటి ప్లాట్​ఫామ్స్​ ఇప్పటికే క్విక్​ డెలివరీలను అందిస్తున్నాయి. వీటిలో బ్లింకిట్​, జెప్టోలు పది నిమిషాల డెలివరీని టార్గెట్​ చేస్తున్నాయి. జియోమార్ట్​ ఎక్స్​ప్రెస్​ డెలివరీ మాత్రం 90 నిమిషాలలో డెలివరీని ప్రామిస్​ చేస్తోంది. మినిమం ఆర్డర్​ వాల్యూ పెట్టకపోయినా, రూ. 199 కి మించిన కొనుగోళ్లకే ఫ్రీ డెలివరీని  జియోమార్ట్ ఎక్స్​ప్రెస్​  చేయాలనుకుంటోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్​ రిటెయిల్​ స్టోర్ల నుంచే జియోమార్ట్​ ఎక్స్​ప్రెస్​ డెలివరీలన్నింటినీ ఫుల్​ఫిల్​ చేస్తారు. గ్రోసరీలు, పర్సనల్​ కేర్​, హోమ్​ కేర్​ ప్రొడక్టులపై ప్రస్తుతం ఫోకస్​ పెడుతున్నారు. మెడిసిన్స్​, స్మార్ట్​ఫోన్ల వంటి చిన్న ఎలక్ట్రానిక్​ ఐటమ్స్​నూ చేర్చాలని రిలయన్స్​ ఆలోచిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

రిలయన్స్​ రిటెయిల్​ మాత్రం అధికారికంగా ఇంకా స్పందించలేదు. మెట్రో సిటీలలో డంజో నెట్​వర్క్​ పటిష్టంగా ఉండటంతో ఆ సేవలనూ ఉపయోగించుకోవాలని జియోమార్ట్​ ఎక్స్​ప్రెస్​ చూస్తోందని సమాచారం. రిలయన్స్​ డిజిటల్​లో మొబైల్స్​, లాప్​టాప్​ వంటి ప్రొడక్టుల  ఆర్డర్లను మూడు గంటలలోపే రిలయన్స్​ రిటెయిల్​ డెలివరీ ఎప్పటి నుంచో ఇస్తోంది.