మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.73,400కి చేరుకుందని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెక్యూరిటీస్ తెలిపింది. అంతర్జాతీయ బులియన్​ మార్కెట్లో ర్యాలీయే ఇందుకు కారణమని పేర్కొంది. బంగారం   క్రితం ముగింపులో రూ.72,950 వద్ద ముగిసింది. వెండి ధర కూడా కిలో రూ.900 పెరిగి రూ.86,900కి చేరుకుంది. క్రితం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కిలో రూ.86 వేల వద్ద ముగిసింది.

ఢిల్లీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పాట్ బంగారం ధరలు (24 క్యారెట్లు) 10 గ్రాములకు రూ. 73,400 వద్ద ట్రేడవుతున్నాయి. విదేశీ మార్కెట్లలో సానుకూల ధోరణితో బుధవారం ధర రూ. 450 పెరిగిందని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ ఎనలిస్ట్​ సౌమిల్ గాంధీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, కమోడిటీ ఎక్స్చేంజ్​లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  2,365 వద్ద వద్ద ట్రేడవుతోంది. ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 26 డాలర్లు పెరిగింది.

యూఎస్​ డాలర్ బలహీనత,  బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పడిపోవడంతో యూరప్​లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయని గాంధీ చెప్పారు. వెండి కూడా ఔన్సుకు  28.80 డాలర్లు పెరిగిందని చెప్పారు. హైదరాబాద్​లో బుధవారం పది గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర రూ.73,250లకు చేరగా, వెండి ధర రూ.91 వేలు పలికింది.