గతంలో బెడ్ పక్కన టేబుల్‌పై లైట్, గ్లాస్ నీరు లేదా ఫోన్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అది మారిపోయింది. టిక్‌టాక్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త ట్రెండ్ ‘బెడ్‌టైమ్ స్టాకింగ్’. ఇందులో జర్నల్స్, బుక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్, స్నాక్స్, ల్యాప్‌టాప్‌లు వంటి వస్తువులను బెడ్ చుట్టూ పెట్టుకుంటారు.
న్యూస్‌వీక్ రిపోర్ట్ ప్రకారం, ప్రధానంగా యువతుల్లో ఈ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. సోషల్ మీడియాలో యంగ్ క్రియేటర్లు అందంగా అమర్చిన స్టాక్‌లను షేర్ చేస్తున్నారు. ఇవి బెడ్ నుంచి లేవకుండానే ఎక్కువ పనులు చేయడానికి సాయపడతాయి.
స్వీడన్‌కు చెందిన ఆర్టిస్ట్ లిన్నియా ఫామ్ తన బెడ్‌టైమ్ స్టాక్ టూర్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు 37,000కి పైగా లైక్‌లు వచ్చాయి. లిన్నియా ‘‘బెడ్‌టైమ్ స్టాక్ అంటే త్వరగా బెడ్‌కు వెళ్లి, ఒకే చోట ఎక్కువ సమయం గడపడం, ఇష్టమైన పనులు చేయడం’’ అని ఆ వీడియోలో పంచుకుంది. ఆమె స్టాక్‌లో హ్యాండ్ క్రీమ్, నెక్ మసాజర్, చిప్స్, బుక్, ఐప్యాడ్, టీవీ రిమోట్, వాటర్, ఇతర చిన్న కంఫర్ట్ ఐటమ్స్ ఉన్నాయి.
సరిగ్గా చెప్పాలంటే ఇది అవసరాలు, అలవాట్లతో నిండిన ఆర్గనైజ్డ్ ఎకోసిస్టమ్. ఇది దీర్ఘకాలిక ప్రశాంతతకు దోహదపడుతుంది అంటోంది జెన్ జెడ్. సాధారణంగా జర్నల్స్, ల్యాప్‌టాప్‌లు, బ్యూటీ ప్రొడక్ట్స్, వాటర్ బాటిల్స్, బుక్స్, స్నాక్స్, టెక్ గాడ్జెట్స్‌ను బెడ్ చుట్టూ పెట్టుకుంటారు.
ఇలా చేస్తే హాబీలు, యాక్టివిటీల మధ్య ఈజీగా స్విచ్ అవ్వొచ్చు. లేవాల్సిన అవసరం లేదు. లిన్నియా దీన్ని మరో జెన్ జీ అలవాటు ‘బెడ్ రాటింగ్’ (బెడ్‌లో గంటల తరబడి ఏమీ చేయకుండా ఉండటం)కి మరింత మైండ్‌ఫుల్ వెర్షన్‌గా వివరించింది. ఈ ట్రెండ్ ‘హ్యాబిట్ స్టాకింగ్’ కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది.
అదేంటంటే చిన్న పాజిటివ్ యాక్షన్స్‌ను కలిపి రొటీన్స్‌ను మెయింటైన్ చేయడం. రీడింగ్, జర్నలింగ్, స్కిన్‌కేర్, ఎంటర్‌టైన్‌మెంట్, ప్లానింగ్ వంటివి వేర్వేరు సమయాల్లో చేయకుండా ఒకే రిచ్యువల్‌గా మార్చేస్తుంది. అయితే, రిలాక్స్ అవుతున్నప్పుడు కూడా అన్నీ ఒకేసారి చేసేయాలనే ఒత్తిడి ఈ ట్రెండ్‌లో కనిపిస్తోంది. దాన్ని గుర్తించకపోవడం గమనార్హం. ఒకేచోట అంతసేపు కూర్చోవడం లేదా పడుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
