 
                                    హైదరాబాద్: భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. అక్టోబర్ 17న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. నాగారం సర్వే నంబర్ 194 ,195లలో ఉన్న బ్యూరోక్రాట్స్ భూములను నిషేధిత జాబితాలో ఉంచాలంటూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును బ్యూరోక్రాట్స్ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేశారు.
ఆధారాలను పరిశీలించిన డివిజన్ బెంచ్.. అవి భూదాన్ భూములు కానప్పుడు నిషేధిత జాబితాలో ఎందుకు ఉంచాలని పేర్కొంది. సర్వే నెంబర్ 194, 195లోని భూములు పట్టా భూములేనని కలెక్టర్ కూడా నివేదిక ఇచ్చారు. అయితే.. సర్వే నెంబర్ 181, 182లలో ఉన్న భూములపై మాత్రం యథాతథ స్థితి కొనసాగుతుందని డివిజన్ బెంచ్ పేర్కొంది.

 
         
                     
                     
                    