కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై నుంచి మోడీ ఫోటో తొలగించండి

కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్‌పై నుంచి మోడీ ఫోటో తొలగించండి

అయిదు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కరోనావైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద నుంచి ప్రధాని మోడీ ఫోటో తొలగించాలని ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనావైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద ప్రధాని మోడీ ఫోటో ఉండటాన్ని తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ విషయం మీద ఈసీకి ఫిర్యాదు చేసింది. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారని టీఎంసీ ఆరోపించింది. దాంతో త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కరోనావైరస్ సర్టిఫికెట్ల మీద నుంచి మోడీ ఫోటో తొలగించాలని కోరుతూ ఈసీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది.

‘ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ తాత్కాలిక ధృవపత్రాలపై మోడీ ఫోటో, పేరు మరియు సందేశాన్ని ఉంచడం ద్వారా అధికారాలను దోపిడీ చేయడమే కాకుండా, కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిదారుల క్రెడిట్‌ను కూడా కొల్లగొడుతున్నారు. వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య సేవా కార్యకర్తలు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు’అని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.